Nallamothu sridhar telugu is typing in whatsapp

ఐస్ లా కరిగిపోయే ఛాలెంజ్ కాదిది -OYChallenge By Nallamothu Sridhar

 

బకెట్ లో నుంచి ఐస్ తీసి నెత్తిన పోసుకుని ఛాలెంజ్ అని విసిరింది ఒక యువ నటి. అంతే ఆ వీడియో కొన్ని క్షణాలలో వైరల్ అయిపోయింది. మీడియాలో దాని మీద స్పెషల్ ప్రోగ్రామ్స్, డిస్కషన్స్. సోషల్ మీడియాలో బతికే సామాన్యులు ఐస్, బకెట్ లు కొనుక్కొని నెత్తిన పోసుకుంటూ ఫంబు, వాట్స్ అప్ లలో ఒకటే షేర్ లు, likes. కొన్ని రోజుల మత్తు తరువాత మర్చిపోయారు.నాకు తెలిసి ఐస్ అమ్ముకునే కంపెనీలకి తప్పితే దాన్ని వలన ఎవరికీ ఉపయోగం లేదు.

బ్లూ వేల్ ఛాలెంజ్… ఒక గేమ్ తో ప్రాణాలు తీసుకోవచ్చు అని చూపించిన ఛాలెంజ్ ఇది. వార్త పత్రికలు, టి.విలలో కూతుహలం కలిగించే హెడ్ లైన్స్ తో దీని గురించి చదివిన తరువాత చాల మంది టీనేజ్ పిల్లలకి ఇదో ఒక గేమ్ గేమ్ ఉంది అని..ఒక సారి ఆడి చూద్దాము అనే కూతుహలం పెరిగింది. వేల్ అంటే అర్ధం తెలియని చాలా మందికి బ్లూ వేల్ మాట మటుకు అలవాటు అయిపోయింది.ఈ ఛాలెంజ్ ఎన్నో ప్రాణాలు బలికొన్నది

ఒక టెక్నాలజీ & పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ (nallamothu sridhar)… తనలోని పాజిటివ్ ఎనర్జీతో 365 రోజులు క్రమం తప్పకుండా సాధించిన ఒక పనితో ఆదర్శంగా నిలిచి తన చుట్టూ ఉన్న సమాజానికి అదే ప్రేరణ కలిగించాలి అని ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. దాని పేరే OYChallenge.

శ్రీధర్ గారి పిలుపు విని oct 25 2017 నుండి స్టార్ట్ అవుతున్న ఛాలెంజ్ లో ప్రత్యక్షముగా 1౦౦౦ మంది, పరోక్షంగా ఇంకొన్ని వందల మంది కదిలారు. OYChallenge మొదట మీటింగ్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.

 

 

కానీ కరిగిపోయిన ఐస్, చంపేసే బ్లూ వేల్ గురించి ఆత్రంగా ఒకరికి ఇంకొకరు షేర్ చేసుకున్న జనాలు… జీవితాన్ని ఒక క్రమంలో పెట్టె ఛాలెంజ్ గురించి మాత్రం ఎక్కువగా మాట్లడుకోటలేదు. అయినా పర్లేదు… ఎందుకంటే ఈ ఛాలెంజ్ రోజులకో, నెలలకో మర్చిపోయే టైం పాస్ ఛాలెంజ్ కాదు. నిజమయిన లైఫ్ చేంజ్ ఛాలెంజ్.

చిన్నగా మొదలయి ఒక ఉద్యమంలా తప్పకుండా మారుతుంది. మొదలుపెట్టిన దారి క్రమక్రమంగా విస్తరించి భావితరాల భవిష్యతుకి బాట వేస్తుంది. మరి ఆ ఛాలెంజ్ విశేషాలు మీ కోసం…. ఆర్టికల్ చదవటమే కాదు. మీరు ఆ ఛాలెంజ్ లో పాల్గొని మీ జీవితాన్ని మార్చుకోండి.

OYChallenge అంటే ఏంటి?

మీ జీవితానికి సొసైటీ కి ఉపయోగపడే ఏ మంచి పని అయినా 365 రోజులు ఆపకుండా పట్టుదలతో కొనసాగించటమే ఈ ఛాలెంజ్. దానితో మీ వ్యక్తిగత, వృత్తిపరమయిన విషయాలలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా మెరుగుపడతాయి.మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది… జీవితం పట్ల మీ దృక్పధం మారిపోతుంది

OYChallenge ఎవరు మొదలుపెట్టారు:

టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా అందరికి సుపరిచితులయిన నల్లమోతు శ్రీధర్ గారు. OYChallange Facebook Group www.facebook.com/groups/OYChallengeOfficial/

ఈ ఛాలెంజ్ లో ఎలా పాల్గొనాలి?

ఛాలెంజ్ గురించి వివరాలు, రూల్స్ కోసం శ్రీధర్ గారు రాసిన ఈ FB పోస్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. క్లిక్ చేసి ఛాలెంజ్ లో పాల్గొనండి

#OYChallenge లో పార్టిసిపేట్ చెయ్యడం ఇలా! రూల్స్ ఇవి !! —————————————————————- ఐస్…

Posted by Sridhar Nallamothu on Sunday, October 22, 2017

 

మరి OYChallenge లో పాల్గొని జీవితాన్ని మార్చుకోండి… దీని గురించి షేర్ చేసి ఇంకొకరి జీవితాన్ని మార్చండి.

Please subscribe to our youtube channel www.youtube.com/smarttelugu
Follow us on Facebook www.facebook.com/smartteluguofficial